అలర్ట్‌: జిల్లాలో ఒకే రోజు ఆరుగురికి కరోనా..

3 Apr, 2020 11:27 IST|Sakshi
కరోనా పాజిటివ్‌ మహిళ కుటుంబ సభ్యులను హైదరాబాద్‌కు తరలిస్తున్న వైద్యసిబ్బంది 

ఒకరు మిర్యాలగూడ, ఐదుగురు నల్లగొండ పట్టణవాసులు

వారి కుటుంబాలకు చెందిన 39మంది క్వారంటైన్‌కు తరలింపు

భయం గుప్పిట నల్లగొండ

సాక్షి నల్లగొండ : నల్లగొండ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లా తొలిసారిగా ఒక్కరోజే ఆరుగురు వ్యక్తులకు కరోనా సోకినట్లు తేలడం సంచలనం సృష్టించింది. రెండు రోజుల కిందట జిల్లా కేంద్రంనుంచి నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారిలో 44మందిని పరీక్షలకు పంపించగా వారిలో 37మంది ఫలితాలు వచ్చాయి. వీరిలో నల్లగొండ పట్టణంలోని ఐదుగురికి, మిర్యాలగూడలో ఒకరికి కరోనా (కోవిడ్‌ –19) వైరస్‌ సోకినట్లు (పాజిటివ్‌) అని తేలింది. కాగా, బుధవారం మరో 17మంది బర్మా దేశస్తులను పరీక్షల కోసం తరలించారు. అంటే మరో 24 మంది రిపోర్టులు అందాల్సి ఉంది. కాగా, కరోనా పాజిటివ్‌ రిపోర్టు వచ్చిన ఆరుగురిని హైదరాబాద్‌ క్వారంటైన్‌లో ఉంచారు. నెగిటివ్‌ వచ్చిన వారిని నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌లో ఉంచారు. 

పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబ సభ్యులకూ పరీక్షలు
మర్కజ్‌ వెళ్లి వచ్చి కరోనా వైరస్‌ బారిన పడిన ఆరుగురు వ్యక్తులకు చెందిన 39మంది కుటుంబ సభ్యులను పోలీసులు, వైద్యాధికారులు గురువారం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలోని క్వారంటైన్‌కు తరలించారు. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పోలీసులు, వైద్య సిబ్బంది వెళ్లి 15 వాహనాల్లో వారందరినీ తీసుకొచ్చారు. వారినుంచి రక్తనమూనాలు సేకరించి సీసీఎంబీకి పంపించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కొండల్‌రావు తెలిపారు. నల్లగొండ పట్టణంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన ఐదుగురు వ్యక్తుల నివాస ప్రాంతాలను జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్, ఎస్పీ ఏ.వి.రంగనాథ్, ఇతర అధికారులు పరిశీలించారు. 


నల్లగొండ : కరోనా పాజిటివ్‌ బాధితుల ఇళ్ల వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీ, అధికారులు 

ప్రజాప్రతినిధులు, మతపెద్దలతో సమావేశం
కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు రావడంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. జనతా కర్ఫ్యూనుంచి కరోనా వ్యాప్తి నివారణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా  జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కలెక్టర్‌, ఎస్పీలు అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతోపాటు స్వయంగా పర్యటనలు చేస్తూ, పరిశీలిస్తూ వస్తున్నారు. నిజాముదీ్దన్‌ మర్కజ్‌ ధార్మిక కార్యక్రమానికి వెళ్ల్విచి్చన వారు రాష్ట్రంలో ఆరుగురు మృతి చెందడంతో జిల్లా అధికారులు అలెర్ట్‌ అయ్యారు.

జిల్లానుంచి నిజాముద్దీన్‌ వెళ్లొచ్చిన వారిని గుర్తించారు. వీరిలోనే ఆరుగురికి కరోనా వైరస్‌ సోకింది. నల్లగొండలోని ఐదుగురు, మిర్యాలగూడలోని ఒకరి నివాస ప్రాంతాల్లో చేపట్టాలేన కట్టుదిట్టమైన  చర్యలు తీసుకునేందుకు ఆయా కౌన్సిలర్లు , మతపెద్దలతో సమీ క్షించేందుకు జిల్లా కలెక్టర్టేట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ ప్రాంతాల్లో పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేయాలని నిర్ణయించారు.  ఆ ప్రాంతాలను పూర్తిగా మూసివేసేలా బారికేడ్లను ఏర్పాటు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఆయా ప్రాంతాల్లోని నివాసితులకు అవసరమైన సరుకులు ప్రభుత్వ యంత్రాంగమే అందించేలా చర్యలు తీసుకోనున్నారు. వైరస్‌ సోకిన వారి కాలనీలను రెడ్‌జోన్లుగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

నార్కట్‌పల్లి మండలంలో భయాందోళన
మరోవైపు నార్కట్‌పల్లి మండలంలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా వైరస్‌ సోకిన ఆరుగురిలో నల్లగొండకు చెందిన ఓ వ్యక్తి నార్కట్‌పల్లి మండలం మాండ్ర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఎస్సెస్సీ పరీక్షలకు ఆయన ఇన్విజిలేటర్‌గా గత నెల  19, 20, 21తేదీల్లో విధులు నిర్వహించారు. మాండ్ర పరీక్ష కేంద్రంలో రెండువందల మందిదాకా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షలకు హాజరయ్యారు. వీరితోపాటు పన్నెండు మంది దాకా ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యారు. దీంతో వీరందరినీ గుర్తించే పనిలో జిల్లా విద్యాశాఖ నిమగ్నమైంది. 

చికిత్స అందించిన వైద్యుడికి అస్వస్థత?
మిర్యాలగూడ అర్బన్‌ : మిర్యాలగూడకు చెందిన వ్యక్తి నిజాముదీ్దన్‌ మర్కజ్‌ వెళ్లి వచ్చాక ఒక విందు ఏర్పాటు చేశారని ప్రచారం జరుగుతోంది. ఆ వేడుకకు ఎవరెవరు హాజరయ్యారనే విషయాన్ని తెలుసుకునే పనిలో అధికార యంత్రాంగం ఉంది. ఢిల్లీ నుంచి వచిన తరువాత సదరు మహిళ జలుబు, దగ్గుతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడి వద్ద చికిత్స చేయించుకున్నట్లు తెలిసింది. ఆ వైద్యుడు సైతం అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్‌లో వైద్యపరీక్షలు చేయంచుకుని స్థానికంగా క్వారంటైన్‌లో ఉన్నాడనే ప్రచారం జరుగుతుంది. పాజిటివ్‌ వచ్చిన వారితో కలిసిన వారు ఎవరైనా ఉంటే వెంట నే వైద్య పరీక్షలు చేయంచుకుని అధికారులకు సహకరించాలని సీఐ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కేశా రవి కోరారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా