ఆరేళ్ల బాలికను ఇంటికి చేర్చిన వాట్సాప్

6 Jun, 2015 00:00 IST|Sakshi
ఆరేళ్ల బాలికను ఇంటికి చేర్చిన వాట్సాప్

బంజారాహిల్స్ (హైదరాబాద్): తప్పిపోయిన ఓ బాలిక ఆచూకీ వాట్సాప్ వల్ల తిరిగి ఇంటికి చేరింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని రేషంబాగ్‌లో నాలుగు రోజుల క్రితం తప్పిపోయిన ఆరేళ్ల బాలిక సంధ్యారాణి పత్రికల్లో వచ్చిన ఫొటోలను కొందరు వాట్సాప్‌లో అందరికీ చేరవేశారు. దీంతో ఖైరతాబాద్‌లో సంధ్యారాణి రోదిస్తూ తిరుగుతుండగా వాట్సాప్ ద్వారా ఆమె ఫొటోను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు బాలికను అదుపులోకి తీసుకొని తల్లిదండ్రులకు అప్పగించారు.
 

మరిన్ని వార్తలు