‘చెప్పు’కుంటే.. కష్టాలే..

10 Jul, 2020 07:24 IST|Sakshi

ప్రతి సంవత్సరం జూన్, జూలైలో చెప్పులకు గిరాకీ ఎక్కువగా ఉండేది.. స్కూలు పిల్లలు షూస్‌ కోసం.. వర్షాకాలం కావడంతో వాటర్‌ ప్రూఫ్‌ స్లిప్పర్లకు డిమాండ్‌ ఉండేది.. కరోనా కారణంగా స్కూళ్లు లేవు. లక్షల సంఖ్యలో ప్రజలు ఊళ్లకు వెళ్లారు. దీంతో రోడ్ల పక్కన చెప్పుల దుకాణాలు నడుపుకునేచిరువ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.

ముప్పే.. ఆటాడు‘కుంటే’..
బ్యాట్, బాల్‌ పట్టి.. వికెట్లు పెట్టి.. ఓ పట్టుపట్టి చాలా రోజులైంది.. అందమైన మైదానంపిలుస్తుంటే క్రికెట్‌ ఆడాల్సిందే అని మనసులో ఉందా.. కాస్త ఆగాల్సిందే.. అది మైదానం అనుకుని వెళ్తే మునగాల్సిందే.. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం గాజులరామారంలోనిఉషా ముళ్లపూడి ఆస్పత్రి వెనుకవైపు ఉంది ఈ కుంట. నిత్యం జల్లులు కురుస్తుండటంతో నీటిపై నాచు పేరుకుపోయి ఇలా అందంగా కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు