‘స్మార్ట్’ కోసం వరంగల్ ప్రణాళికలు

22 Apr, 2016 02:51 IST|Sakshi

సవరించిన ప్రణాళికలను కేంద్రానికి సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీల ప్రాజెక్టుకు ఎంపిక కోసం వరంగల్ నగరానికి సంబంధించిన సవరించిన ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం కేంద్ర పట్టణాభివృద్ధిశాఖకు అందజేసింది.  వరంగల్ నగరానికి సంబంధించిన ప్రతిపాదనలను గతంలోనే అందజేశారు. కానీ తొలిదశ స్మార్ట్ సిటీల జాబితాలో వరంగల్‌కు చోటు దక్కలేదు. తొలిదశలో దేశవ్యాప్తంగా 97 నగరాల నుంచి ప్రతిపాదనలురాగా... 20 నగరాలను ఎంపిక చేశారు. అందులో వరంగల్ 23వ ర్యాంకు సాధించి అవకాశం కోల్పోయింది. తొలిదశలో అవకాశం రాని 23 రాష్ట్రాలకు చెందిన నగరాలకు మరో అవకాశాన్ని కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.

ఏప్రిల్ 21వ తేదీలోగా సవరించిన ప్రణాళికలను అందించాలని సూచించింది. ఈ మేరకు వరంగల్ ప్రణాళికలను అందజేశారు. వీటిపై మే 15కల్లా నిర్ణయం తీసుకునే అవకాశముందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వర్గాలు తెలిపాయి.

>
మరిన్ని వార్తలు