ఎస్‌ఎంఎస్‌ పంపండి... పేరుందో లేదో చూసుకోండి

28 Jun, 2018 12:57 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ జిల్లా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో, లేదో తెలుసుకునేందుకు సెల్‌ ఫోన్‌ నెంబర్‌ 9223166166 కు  మెసేజ్‌ పంపవచ్చునని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా పోలింగ్‌బూత్‌ స్థాయి అధికారులు మే 21 నుంచి ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారని, ఈ కార్యక్రమం జూన్‌ 30 వరకు కొనసాగుతుందన్నారు. 

సర్వే సందర్భంగా ఓటర్ల జాబితాలో తమ పేరులేనివారు నమోదుచేసుకోవచ్చునని లేదా www.ceotelangana.nic.in అనే వెబ్‌సైట్‌ ద్వారా కూడా  ఫారం–6లో ఓటరుగా పేరు  నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. అభ్యంతరాలను ఫారం–7 ద్వారా, పొరపాట్ల సవరణకు ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. వీటితోపాటు ఓటరు జాబితాలో పేరున్నదీ, లేనిదీ తెలుసుకునేందుకు 9223166166 అనే సెల్‌ నెంబర్‌కు TS SPACE VOTER ID NO.( EXAMPLE TS VOTE ABC 1234567) మెసేజ్‌ పంపడం ద్వారా తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు.  దీంతో పాటు మైజీహెచ్‌ఎంసీ మొబైల్‌ యాప్‌లో కూడా  ఓటరు  నమోదు, ఓటరు సమాచారం తెలుసుకునే విధానాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.ఓటర్ల జాబితా సవరణపై నగరంలోని 11 లక్షల ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు

మరిన్ని వార్తలు