ఐదు కుటుంబాలు సాంఘిక బహిష్కరణ 

31 Oct, 2017 01:49 IST|Sakshi

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు 

కల్లూరు: తమనే ప్రశ్నిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కుల పెద్దలు గ్రామంలోని ఐదు కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేస్తూ.. పంచాయితీలో తీర్మానం చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరులోని శాంతినగర్‌కు చెందిన గుర్రాల సుధీర్, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఖమ్మంపాటి శ్రీనివాసరావు, కంటెపూడి సురేష్, వంగూరి ప్రవీణ్‌కుమార్‌ల కుటుంబాలను సాంఘికంగా బహిష్క రించారు. దసరా పండుగ సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించారు.

పోటీలు అనంతరం పెద్దల వద్ద ఉన్న డబ్బుల లెక్క చెప్పాలని ఈ ఐదుగురు డిమాండ్‌ చేశారు.  దీంతో స్థానికుల సమక్షంలో  లెక్కలు చెప్పారు. ఆ తర్వాత ‘మమ్మల్నే ప్రశ్నించి లెక్కలు అడుగుతారా’ అంటూ పంచాయితీ పెట్టి వారి కుటుంబాలను సాంఘిక బహిష్కణ చేస్తున్నట్లు తీర్మానం చేశారు. ఈ సంఘటన 28 రోజుల క్రితం జరగగా, కొందరు కుల పెద్దల జోక్యంతో బాధితులు ఇన్నిరోజులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం బాధితులు పోలీసులను ఆశ్రయించారు.  కులపెద్దలు సైతం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశా రు.  క్షమాపణలు చెప్పాలని పెద్ద మను షులకు సూచించారు.  అయితే  పంచా యితీ నిర్వహించి అందరి సమక్షంలోనే క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు