సామాజిక, విప్లవ శక్తులు ఏకమవ్వాలి

10 Aug, 2015 01:53 IST|Sakshi
సామాజిక, విప్లవ శక్తులు ఏకమవ్వాలి

{పైవేట్ రిజర్వేషన్లు సాధించాలి
సామాజిక విశ్లేషకుడు   {పొఫెసర్ కంచె ఐలయ్య

 
విద్యారణ్యపురి: ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు సాధించేందుకు సామాజిక, విప్లవ శక్తులు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని ప్రముఖ సామాజిక విశ్లేషకుడు, ఓయూ ప్రొఫెసర్ కంచె ఐలయ్య పేర్కొన్నారు. ఆదివారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్‌లో ‘ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లు’ అనే అంశంపై నిర్వహించిన జిల్లాస్థారుు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రైవేట్ రంగం అంతా అగ్రకులాల చేతుల్లోనే ఉందని, ఆయూ రంగాల్లో రిజర్వేషన్లు లేక ఎస్సీ, ఎస్టీ, బీసీలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మారాయని విమర్శించారు. పాలకవర్గాల విధానాలపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల పోరాట సంఘం రాష్ర్ట అధ్యక్షుడు జాడి ముసలయ్య మాట్లాడుతూ, ఈ ఉద్యమంలో విద్యావంతులు, మేధావులు భాగస్వాములు కావాలని కోరారు.

బీసీసబ్‌ప్లాన్ సాధన కమిటీ చైర్మన్ కె. మురళీమనోహర్, దళితరత్న బొమ్మల కట్టయ్య, నిజాం కాలేజి ప్రిన్సిపాల్ గాలి వినోద్‌కుమార్, ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాలప్రిన్సిపాల్ భద్రునాయక్, కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకులు సంఘం అధ్యక్షుడు ఎం. సారంగపాణి, సీపీఎం,సీపీఐ , ఎంసీపీఐ, ఆర్‌ఎస్‌పీ ఫార్వర్డ్‌బ్లాక్ జిల్లా కార్యదర్శులు సారంపెల్లి వాసుదేవరెడ్డి, టి శ్రీనివాసులు, పి. భూమయ్య, కె. శివాజీ, ఇ. వేణు, టీపీఎస్ రాష్ట్రకన్వీనర్ జి రాములు తదితరులు మాట్లాడారు. వివిధ ప్రజాసంఘాల బాధ్యులు సీహెచ్. రంగయ్య, డి. తిరుపతి, భీమానాత్ శ్రీనివాస్, టి. స్కైలాబ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.  
 

>
మరిన్ని వార్తలు