ప్రేమ, పెళ్లి పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..

12 May, 2017 18:13 IST|Sakshi
ప్రేమ, పెళ్లి పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..

హైదరాబాద్: పెళ్లి చేసుకోవాలంటూ తోటి ఉద్యోగిని వేధిస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘట్‌కేసర్ ప్రాంతానికి చెందిన చరణ్ చౌదరి ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అతడు తోటి ఉద్యోగిని ఒకరిని ప్రేమ, పెళ్లి పేరుతో వెంటపడి అల్లరి చేస్తున్నాడు. అయితే అతని ప్రేమను ఆమె తిరస్కరిస్తూ వచ్చింది. ఆ నేపథ్యంలో గురువారం సాయంత్రం చరణ్ ఆ యువతిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు.

తనను పెళ్లి చేసుకోవాలని  మరోసారి ఆమెను కోరాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. ఆమె పదేపదే నిరాకరించడంతో విసుగు చెందిన చరణ్ ఆమెపై దాడికి దిగాడు. ఆ యువతిని కొట్టి, గోడకేసి బలంగా గుద్దాడు. అతని నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసుకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న చరణ్ చౌదరిని అరెస్ట్ చేశారు.

>
మరిన్ని వార్తలు