సైనికుల సేవలు వెలకట్టలేనివి: గవర్నర్‌

8 Dec, 2019 02:03 IST|Sakshi

సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి రూ.52 లక్షల సేకరణ

లక్డీకాపూల్‌: దేశానికి సైనికులు చేసే సేవలు వెలకట్టలేనివని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. వారి కుటుంబాలకు ఆర్థిక చేయూతనందించేందుకు నిధిని ఏర్పా టుచేయడం అభినందనీయమన్నారు. శని వారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి రూ.52 లక్షలు విరాళాలను సేకరించిన హైద రాబాద్‌ ప్రాంతీయ సైనిక్‌ సంక్షేమ అధికారి శ్రీనేష్‌కుమార్‌ నోరి సేవలను గవర్నర్‌ కొనియాడారు. ఈ సందర్భంగా నోరికి రాష్ట్ర స్థాయిలో రోలింగ్‌ ట్రోఫీని ప్రదానం చేశారు. సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కల్నల్‌ రమేశ్‌ కుమార్‌ మాట్లాడారు.

గవర్నర్‌ తమిళిసైతో బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ భేటీ
బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ శనివారం గవర్నర్‌ తమిళిసైని రాజ్‌ భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు.  ఇక అంతకుముందు తనను కలిసిన ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌డే ఫండ్‌కు కొంతమొత్తాన్ని ఆయన విరాళంగా అందజేశారు.

మోడ్రన్‌గా తీర్చిదిద్దుతాం...
సుల్తాన్‌బజార్‌: ఉస్మానియా ఆస్పత్రిని మోడ్రన్‌గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌ అల్యూమినీ అసోసియే షన్‌ ఆధ్వర్యంలో శనివారం కోఠిలోని ఓఎంసీ ఆడిటోరియంలో గ్లోబల్‌మీట్‌– 2019 నిర్వహించారు. దీనికి హాజరైన గవర్నర్‌.. ప్రొఫెసర్‌ ధర్మరెడ్డి, ప్రొఫెసర్‌ డాక్టర్‌ గోపాల్‌కిషన్‌ని సత్కరించారు.  కార్యక్రమంలో సంఘం గౌరవ కార్యదర్శి డాక్టర్‌ కృష్ణమూర్తి, అధ్యక్షులు ఆర్‌ఎస్‌ తపాడియా, ట్రస్ట్‌ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

రేపు యాదాద్రికి గవర్నర్‌
10, 11 తేదీల్లో భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటన
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సోమవారం ఉదయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు ఆమె పర్యటన ఖరారైంది. అదే రోజు స్వామి దర్శనం అనంతరం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో జరిగే ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆ రోజున అక్కడే బస చేసి, 10వ తేదీన భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తారు. అక్కడ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం లక్ష్మీ పంప్‌హౌస్, లక్ష్మీ బ్యారేజీ, సరస్వతి బ్యారేజీలను సందర్శిస్తారు. 11వ తేదీన పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్న గవర్నర్, మహిళా సంఘాలు చేస్తున్న కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం నందిమేడారంలోని ప్యాకేజీ–6 పనులను తమిళిసై పరిశీలించనున్నారు.   

మరిన్ని వార్తలు