రాజకీయ వేదికగా వాడుకోనీయం

12 Mar, 2017 02:03 IST|Sakshi
రాజకీయ వేదికగా వాడుకోనీయం

సభను అడ్డుకోవడమే ప్రతిపక్షాల లక్ష్యం: సోలిపేట
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగిస్తుండగా టీడీపీ సభ్యులు అనుచితంగా వ్యవహరించారని, వారిని సస్పెండ్‌ చేయడాన్ని కాంగ్రెస్, బీజేపీ రాజకీయ చేయాలనుకోవడం విచారకరమని శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌ సోలిపేట రామలింగారెడ్డి విమర్శించారు.

ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గువ్వల బాల రాజులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీని విపక్షాలు రాజకీయ వేదికగా వాడుకోవాలని చూస్తున్నాయని, వారి ఆటలు సాగనీయమని స్పష్టం చేశారు. గవర్నర్‌ ప్రసంగం జరుగుతుండగా టీడీపీ సభ్యులు రేవంత్, సండ్ర వెంకట వీరయ్య రన్నింగ్‌ కామెంట్రీ చేశారని, వారి సస్పెన్షన్‌ సబబేనని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ ఓకే రీతిన వ్యవహరిస్తున్నాయని, సభను సీఎల్పీ నేత జానారెడ్డి తప్పు దోవ పట్టించారని ఆరోపించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు