కేసీఆర్‌కు సవాల్‌ విసిరిన సోమారపు

6 Nov, 2019 16:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించకుంటే ఐదు వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇస్తామన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో ప్రయివేటు బస్సులతో ప్రయాణ చార్జీలు పెంచకుండా నడపగలరా అని ప్రశ్నించారు. అలా నడిపితే తాను గుండు గీసుకోవడానికి సిద్ధమని సవాల్‌ విసిరారు. నడపకపోతే కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారా అని నిలదీశారు. 
చదవండి: ‘ఆర్టీసీని చంపొద్దు.. బతికించండి’

మరిన్ని వార్తలు