కాంగ్రెస్‌ను గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలి

16 Mar, 2014 03:42 IST|Sakshi
కాంగ్రెస్‌ను గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలి

 మాజీ మంత్రి సునీతారెడ్డి
 
 కౌడిపల్లి, న్యూస్‌లైన్: పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను సజావుగా ముందుకు నడిపి, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఎంపీ స్థానాల ను కానుకగా ఇవ్వాలని రాష్ట్ర మాజీ మంత్రి సునీతారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో శనివారం కౌడిపల్లి మండ లం నాగ్సాన్‌పల్లి ఫాం హౌజ్ వద్ద కాం గ్రెస్ పార్టీ మండలం అధ్యక్షుడు మాణి క్యరెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం, బీజేపీలు తెలంగాణకు ఒప్పుకున్నా చివర్లో అడ్డుతగిలాయని విమర్శించారు. అయినా సోనియాగాంధీ ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణను తెచ్చింది, ఇచ్చి ంది కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు. అందుకు కృతజ్ఞతగా రాష్ట్రంలో మొత్తం ఎంపీలను గెలిపించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అ య్యేలా చూడాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థులను గెలిపించుకోవాల్సి ఉందన్నారు.

 

ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో చేసిన చిన్నచిన్న తప్పులను సరిదిద్దుకుని కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలన్నారు. నియోజకవర్గంలో రూ. 2 వేల కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచిం చారు. ప్రత్యేక రాష్ట్రం, అభివృద్ధి చేసిన మనకు మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉందని తెలిపారు.


 నర్సాపూర్ నుంచే పోటీ
 త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కొందరు కావాల నే ప్రచారం చేస్తున్నారని ఇలాంటి వాటిని ప్రజలు నమ్మ రాదని మాజీ మంత్రి సునీతారెడ్డి కోరారు. నర్సాపూర్ ప్రజలు తనను కూతురిగా భావించి ఎన్నికల్లో గెలిపిస్తున్నారని వారికి రుణపడి ఉంటానన్నారు.

 

కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు యాదాగౌడ్, విశ్వంబర స్వామి, సీడీసీ మాజీ చైర్మన్ దుర్గారెడ్డి,  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాణిక్య రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణగౌడ్, నాయకులు రాంచంద్రారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు