త్వరలో హైపర్‌ సోనిక్‌ వాహనాలు

15 Oct, 2017 03:47 IST|Sakshi

పదేళ్లలో మిలటరీ ఆపరేషన్స్‌లో..

2050 నాటికి మానవ రవాణా

ఐఐటీ హైదరాబాద్‌ వర్క్‌షాప్‌లో వక్తలు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ధ్వనివేగానికి మించిన వేగం (హైపర్‌ సోనిక్‌)తో ప్రయాణించే వాహనాల తయారీ సమీప భవిష్యత్తులో సాధ్యమవుతుందని రక్షణ, అంతరిక్ష పరిశోధన రంగాల శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఒకరోజు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఐఐటీ హైదరాబాద్‌ కంది ప్రాంగణంలో జరిగిన ఈ వర్క్‌షాప్‌లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ)తోపాటు విద్యా, పారిశ్రామిక రంగాలపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు హాజరయ్యారు.

వచ్చే పదేళ్లలో మిలటరీ ఆపరేషన్స్‌లో, 2050 నాటికి మానవ రవాణాలో హైపర్‌ సోనిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.  హైపర్‌ సోనిక్‌ వాహనాల తయారీలో 1800 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రతను తట్టుకునే మిశ్రమ లోహాలు కీలకపాత్ర పోషిస్తాయని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సమీర్‌.వి.కామత్‌ వెల్లడించారు. ఈ లోహం తయారీనే అతిపెద్ద సవాలుగా నిలవబోతోందన్నారు.

డిఫెన్స్‌ మెటలర్జికల్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ ఈ దిశగా సానుకూల అడుగులు వేస్తోం దని కామత్‌ వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే లోహాల తయారీపై అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రెజిల్‌ తదితర దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయని డీఆర్‌డీఓ డైరెక్టర్‌ ఎం ఎస్‌ఆర్‌ ప్రసాద్‌ వెల్లడించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ పరిశోధనల్లో ముందంజలో ఉందన్నారు.

ఇప్పటివరకు ఐదారు సెకన్లు మాత్రమే నడిచే వాహనాలు రూపొందించిన విషయాన్ని ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. కొత్తగా కనుగొనే మిశ్రమ లోహం పునర్‌ వినియోగానికి వీలుగా ఉండటంతోపాటు.. అందుబాటు «ధరల్లో ఉండేలా చూడాల్సి ఉందన్నారు.  

రెండు గంటల్లోనే న్యూయార్క్‌ నుంచి న్యూఢిల్లీ
హైపర్‌సోనిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తే న్యూయార్క్‌ నుంచి న్యూఢిల్లీ వరకు కేవలం రెండు గంటల వ్యవధిలో ప్రయాణం చేయొచ్చని ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌ వెల్లడిం చారు. హైపర్‌ సోనిక్, సంబంధిత రంగాల్లో పరిశోధనలు చురుగ్గా సాగుతున్నాయని హైపర్‌సోనిక్‌ టెస్ట్‌ వెహికల్‌ ప్రోగ్రాం ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.కె.శర్మ వెల్లడించారు.

అత్యంత వేగంగా ప్రయాణించాలనే కలను హైపర్‌సోనిక్‌ సాంకేతికత సు«సాధ్యం చేయబోతోందని ఇస్రో శాస్త్రవేత్త శ్యాంమోహన్‌ వెల్లడించారు. మిలిటరీ ఆపరేషన్స్, అంతరిక్ష వాహనాలు, మానవ రవాణాలో హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీ ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తు తం ఉపగ్రహాల ప్రయోగంలో వినియోగిస్తున్న శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ను తిరిగి ఉపయోగించుకునే అవకాశం లేదన్నారు. హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీకి వినూత్న ఆవిష్కరణలు జోడించి.. శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్స్‌ను తిరిగి ఉపయోగించే పరిస్థితి రావాలన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా