దక్షిణ మధ్య రైల్వే 108 ప్రత్యేక రైళ్లు

5 Feb, 2019 01:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి–నాగర్‌సోల్‌–నాందేడ్‌–కాకినాడల మధ్య 108 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి–నాగర్‌సోల్‌ (07417) వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ (28 సర్వీసులు) మార్చి 1, 8, 15, 22, 29, ఏప్రిల్‌ 5, 12, 19, 26, మేæ 3, 10, 17, 24, 31 తేదీల్లో ఉదయం 7.30 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 11.35 గంటలకు నాగర్‌సోల్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07418) మార్చి 2, 9, 16, 23, 30, మే 4, 11, 18, 25, జూన్‌ 1 తేదీల్లో రాత్రి 10 గంటలకు నాగర్‌సోల్‌లో బయలుదేరి రెండోరోజు ఉదయం 4 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. నాందేడ్‌–తిరుపతి (07607) రైలు(26 సర్వీసులు) మార్చి 5, 12, 19, 26, ఏప్రిల్‌ 2, 9, 16, 23, 30, మే 7, 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి చేరుతుంది.

తిరుగు ప్రయాణంలో (07608) మార్చి 6, 13, 20, 27, ఏప్రిల్‌ 3, 10, 17, 25, మే 1, 8, 15, 22, 29 తేదీల్లో మధ్యాహ్నం 3.35 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 11.30 గంటలకు నాందేడ్‌ చేరుతుంది. తిరుపతి–కాకినాడ టౌన్‌–రేణిగుంట (07942) (26 సర్వీసులు) మార్చి 3, 10, 17, 24, 31, ఏప్రిల్‌ 7, 14, 21, 28, మే 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 7గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో (07941) మార్చి 4, 11, 18, 25, ఏప్రిల్‌ 1, 8, 15, 22, 29, మే 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 7 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6 గంటలకు రేణిగుంట చేరుకుంటుంది. కాచిగూడ–కాకినాడ పోర్ట్‌(07425) (28 సర్వీసులు) మార్చి 1, 8, 15, 22, 29 ఏప్రిల్‌ 5, 12, 19, 26 మే 3, 10, 17, 24, 31 తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6 గంటలకు కాకినాడ పోర్ట్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07426) మార్చి 2, 9, 16, 23, 30 ఏప్రిల్‌ 6, 13, 20, 27 మే 4, 11, 18, 25, జూన్‌ 1 తేదీల్లో సాయంత్రం 5.50 గంటలకు కాకినాడ పోర్ట్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5.10 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.   

మరిన్ని వార్తలు