దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆకస్మిక తనిఖీ

13 Feb, 2015 22:32 IST|Sakshi
దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆకస్మిక తనిఖీ

వరంగల్ టౌన్: వరంగల్ రైల్వే స్టేషన్‌లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్ కుమార్ శ్రీవాత్సవ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. రైల్వే స్టేషన్‌లో భద్రత, ప్రయాణికులు అందుకుంటున్న సౌకర్యాలు, సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. వరంగల్ స్టేషన్‌లో 108 సేవలు, అత్యాధునికమైన వెయిటింగ్ హాల్‌ను, ఎస్కలేటర్‌లను ఆయన ప్రారంభించారు. స్టాల్స్‌లో కూల్‌డ్రింక్స్ ధరలు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే గోదాం హమాలీలు తమ సమస్యలపై జీఎంకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం రైల్వే ఉద్యోగులకు సంబంధించిన పుస్తకాన్ని శ్రీవాస్తవ విడుదల చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు