5, 6 తేదీల్లో రాష్ట్రంలోకి ‘నైరుతి’

3 Jun, 2018 01:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనా లు తెలంగాణలోకి ఈ నెల 5, 6 తేదీల్లో ప్రవేశిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రుతుపవనాల రాకకు ముందు కురిసేవని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

సంబంధిత ప్రాంతంలో వాతావరణశాఖ ఆధ్వర్యం లోని రెయిన్‌గేజ్‌ స్టేషన్లలో 60 శాతం వర్షపాతం నమోదు కావడం, ఆయా చోట్ల 2.5 మిల్లీమీటర్లకు మించి వర్షం కురవడం, గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీయడం ద్వారా రుతుపవనాల ఆగమనా న్ని గుర్తిస్తామన్నారు. ఈ ప్రమాణాలతో పాటు రేడియేషన్‌ తగ్గాల్సి ఉంటుందని, అప్పుడే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లుగా ప్రకటిస్తావన్నారు. ప్రస్తుతం కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఇంకా సాధారణంగా ఉన్నాయన్నారు. అయితే ఈ పరిస్థితి తెలంగాణపై ప్రభావం చూపబోదని ఆయన తెలిపారు.

క్యుములోనింబస్‌ కారణంగా..
రుతుపవనాలకు ముందుగా తేమ గాలు లు వీస్తుండటంతో క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని వై.కె.రెడ్డి తెలి పారు. దీంతో ఎండలు తగ్గుతున్నాయన్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. మంథనిలో 8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. గుండాల, అచ్చంపేటల్లో 7 సెంటీమీటర్ల చొప్పున, వికారాబాద్, మోమినపేటల్లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

మరిన్ని వార్తలు