రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు

21 Jun, 2019 16:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజల ఎదురుచూపులకు తెరపడింది. ఎండ తాపంతో ఉక్కిరిబిక్కిరి అయినవారికి ఉపశమనం కలిగించేలా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించనున్నాయి. రుతుపవనాల ప్రభావంతో గురువారం సాయంత్రం నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తొలుత ఈ నెల 8న రుతుపనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. ఆ తర్వాత పలు తేదీలను ప్రకటించారు. కానీ చివరకు శుక్రవారం రుతుపనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. 

నగరంలో పలుచోట్ల భారీ వర్షం..
రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎల్‌బీ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, హయత్‌నగర్‌, మీర్‌పేట్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట,కోఠి, లక్డీకాపూల్‌, జూబ్లీహిల్స్‌, మాసబ్‌ట్యాంక్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది.

ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం..
ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధం ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడటంతో కోస్తాంధ్రలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో కోస్తాలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం. 

మరిన్ని వార్తలు