నేడు పలు చోట్ల వర్షాలు

9 Aug, 2018 05:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో కేంద్రీకృతమైన వాయుగుండం ఉత్తర ఒడిశా, పశ్చి మ బెంగాల్‌ తీరాల మధ్య బాలాసోర్‌ సమీపంలో తీరాన్ని దాటింది. తదుపరి ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్ప పీడనంగా మారింది. దీని వల్ల తెలంగాణలో గురువారం పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమురంభీం, మంచిర్యాల, జగిత్యాల, కామారెడ్డి, రాజ న్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురంలో 6 సెం.మీ, భూపాలపల్లిలో 6 సెం.మీ, పెరూర్‌లో 5 సెం.మీ, ఏటూ రునాగారంలో 5 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో 5 సెం.మీ, బూర్గంపాడులో 5 సెం.మీ, మణుగూరులో 5 సెం.మీ, భద్రాచలం లో 4 సెం.మీల మేర వర్షపాతం నమోదైంది. 

>
మరిన్ని వార్తలు