రూ. 20 కోట్ల సోయాబిన్ పట్టివేత

19 May, 2015 12:45 IST|Sakshi
రూ. 20 కోట్ల సోయాబిన్ పట్టివేత

ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా నిల్వచేసిన 36వేల క్వింటాళ్ల సోయాబిన్ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు.  పట్టణ శివారులోని డైమండ్ గోడౌన్ పై మంగళవారం ఆర్డీవో, రెవిన్యూ అధికారులు దాడులు జరిపారు. గోడౌన్‌లో 36వేల క్వింటాళ్ల సోయాబిన్ విత్తనాలను అక్రమంగా బస్తాల్లో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. 20 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు