చట్టాలపై పోలీసులు అవగాహన పెంచుకోవాలి

25 Mar, 2018 10:55 IST|Sakshi
మాట్లాడుతున్న ఎస్పీ అనురాధ

మహబూబ్‌నగర్‌ క్రైం: వివిధ కేసుల్లో నిందితులకు శిక్ష ఖరారు చేయడంలో తగినంత ఆధారాలు సేకరించేందుకు పోలీసు పరిశోధనాధికారులు కృషి చేయాలని ఎస్పీ బి.అనురాధ సూచించారు. జిల్లా పోలీసు కార్యాల యం లో శనివారం ఉదయం ‘చిట్‌ఫండ్‌ వ్యవహారాల్లో జరిగే మోసాలు–ప్రజలకు చేయాల్సిన న్యాయ సేవలు,  ఇతర చట్టాలు’ అంశంపై సదస్సు జరిగింది.

ఈ సదస్సును ప్రారంభించిన ఎస్పీ అనురాధ మాట్లాడుతూ పోలీసు అధికారులు నూతన చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ సాక్షాల సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఏఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు, డీఎస్పీలు భాస్కర్, శ్రీధర్, పీపీపీబాలగంగాధర్‌రెడ్డి, ఏపీపీ అజయ్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు