తెలంగాణ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

22 Jul, 2020 16:54 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, కొమురం భీం, ఆసిఫాబాద్: మావోయిస్టుల‌ను జిల్లా అట‌వీ ప్రాంతం నుంచి త‌రిమి వేస్తామ‌ని, వారి ఆగ‌డాల‌ను తిప్పి కొట్టేందుకు పోలీసు ద‌ళాలు విస్తృత చ‌ర్య‌లు చేప‌డుతున్నట్లు ఎస్పీ విష్ణు వారియ‌ర్ ఓ ప్ర‌క‌ట‌నలో తెలిపారు. ఇప్పటికైనా మావోయిస్టులు తమ తీరును మార్చుకుని ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. వెంటనే లొంగిపోయిన వారికి అన్ని విధాలా జీవనోపాధికి సహకరిస్తామని, కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించవచ్చని పేర్కొన్నారు. మావోయిస్టులకు ప్రజలు ఎవరు సహకరించవద్దని, వారి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు. స‌మాచారం తెలిపిన వారికి వారి వివ‌రాలు గోప్యంగా ఉంచడంతో పాటు వారికి త‌గిన బ‌హుమ‌తులు ఇస్తామ‌ని పేర్కొన్నారు. 

ఈనెల 25న తెలంగాణ బంద్
ములుగు జిల్లా వెంకటాపురం మండలం విజయపురి కాలనీ చర్ల- వెంకటాపురం ప్రధాన రహదారిపై ప‌ట్ట‌ప‌గలే వెలిసిన మావోయిస్టులు పోస్ట‌ర్లు కలకలం రేపాయి. తెలంగాణ రాష్ట్ర కమిటీ సిపిఐ మావోయిస్టు పేరుతో వెలసిన ఈ పోస్టర్లలో.. విరసం నేత వరవరరావు, వికలాంగుడైన సాయిబాబాలతో పాటు మిగ‌తా 12 మందిని  విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. వారిపై పెట్టిన కేసుల‌ని ఎత్తివేయాల‌ని డిమాండ్ చేస్తూ ఈనెల 25న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. అంతేకాకుండా అడ‌వుల నుంచి గ్రేహాండ్స్ బలగాలను ప్రభుత్వం తక్షణమే  ఉప సంహరించుకోవాలని లేఖలో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు