ఇందూరులో ఇస్రో సందడి

6 Oct, 2019 08:34 IST|Sakshi
స్పేస్‌వీక్‌ ప్రదర్శనను వీక్షిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

ఆలోచనలు విస్తృతమయ్యేందుకు చక్కటి వేదిక

ప్రదర్శనలతో విద్యార్థులకు ఎంతో ఉపయోగం 

నేడు ముగింపు కార్యక్రమం

సుభాష్‌నగర్‌(నిజామాబాద్‌అర్బన్‌): ఇటీవల కాలంలో పేపర్లు, టీవీల్లో మార్మోగిన చంద్రయాన్‌–2 ప్రయోగం, శ్రీహరికోట ద్వారా ప్రయోగించిన రాకెట్లు, సాటిలైట్స్‌ వంటి అబ్బురపర్చే ప్రదర్శనలు వీక్షిస్తే ఇస్రో ఇందూరుకు దిగొచ్చినట్లు అన్పిస్తోంది. అంతరిక్ష పరిశోధనల్లో నాసాకు తలదన్నే రీతిలో ప్రయోగాలను ఆవిష్కరిస్తూ ఇస్రో ముందుకు సాగుతోంది. రానున్నరోజుల్లో చంద్రయాన్‌–3, గగన్‌యాన్‌ వంటి ప్రయోగాలకు సిద్ధమౌతోంది. అటువంటి నూతన ఆవిష్కరణకు నిలయంగా మారిన ఇస్రో ఆధ్వర్యంలో నగరంలోని నిర్మల హృదయ స్కూల్‌లో స్పేస్‌ వీక్‌ కార్యక్రమంలో ప్రదర్శనలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అబ్బురపరుస్తున్నాయి. స్పేస్‌ వీక్‌లో ప్రదర్శనలను ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, డీఈవో దుర్గాప్రసాద్‌ శనివారం సందర్శించారు. ప్రదర్శనల గురించి వీరికి ఇస్రో శాస్త్రవేత్తలు వివరించారు. నగరంలో మొదటిసారిగా ప్రదర్శనను ఏర్పాటు చేయడంతో రెండ్రోజుల్లో సుమారు 10 వేల మంది విద్యార్థులు రాకెట్లు, ఉపగ్రహాలను తిలకించారు. 

45 ప్రయోగాల ప్రదర్శనలు
స్పేక్‌ వీక్‌ కార్యక్రమంలో భాగంగా మొత్తం 45 ప్రదర్శనలు ఉంచారు. దేశంలో ఇప్పటివరకు చేపట్టిన ఆవిష్కరణలను విజ్ఞాన సదస్సులో ప్రదర్శించారు. ప్రపంచం మెచ్చుకునేలా భారత శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారని, ఇలాంటి ప్రదర్శనల ద్వారా యువ శాస్త్రవేత్తలకు అవకాశం లభిస్తుంది. ఎన్నో ఆవిష్కరణలతోపాటు విదేశాలకు చెందిన ఉపగ్రహాలను ఇక్కడి నుంచి ప్రయోగించి విజయవంతం చేసిన తీరును విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా రాకెట్లు, ఉపగ్రహాల నమూనాలను ప్రదర్శనలో ఉంచడంతో వాటి గురించి తెలుసుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపారు. అంతేగాకుండా చంద్రయాన్‌–2, పీఎస్‌ల్వీ, జీఎస్‌ఎల్వీ, తదితర ఉపగ్రహాలు, రాకెట్ల తయారీ, వాటి పనితీరు, తదితర అంశాల గురించి విద్యార్థులు వలంటీర్లను అడిగి తెలుసుకున్నారు.
 
నేడు ముగింపు కార్యక్రమం
నగరంలోని నిర్మల హృదయ పాఠశాలలో కొనసాగుతున్న స్పేస్‌ వీక్‌ కార్యక్రమం ఆదివారంతో ముగియనుంది. మధ్యాహ్నం వరకు మాత్రమే ప్రదర్శనలను తిలకించే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, డ్రాయింగ్, ఎగ్జిబిట్స్‌లను ఎంపిక చేసి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. కార్యక్రమానికి మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌ శాంసన్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి

‘అలాంటి ధాన్యం కొనుగోలు చేయోద్దు’

లక్ష విలువైన మద్యం బాటిల్స్‌తో పరార్‌

మతమౌఢ్యం తలకెక్కిన ఉన్మాది ఒవైసీ..

తెలంగాణ పవర్ గ్రిడ్ సురక్షితం..

సినిమా

దండంబెట్టి చెబుతున్నా.. దండతో గోడెక్కకు

ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: త‌మ‌న్

కరోనా: క‌నికాకు బిగ్‌ రిలీఫ్‌

అందరూ ఒక్కటై వెలుగులు నింపండి: చిరు, నాగ్‌

కరోనా క్రైసిస్‌: శివాని, శివాత్మిక ఉదారత

ప్రధాని పిలుపుపై రామ్‌ చరణ్‌ ట్వీట్‌