వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌

13 Aug, 2017 02:20 IST|Sakshi
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌

మంత్రి పోచారం వెల్లడి
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మార్చి.. విదేశాలకు సైతం విత్తనాలను సరఫరా చేసేలా అధి కారులు కృషి చేయాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ వ్యవసాయశాఖకు ప్రత్యే కంగా బడ్జెట్‌ ప్రవేశ పెట్టబోతున్నారని తెలిపారు. సచివాలయంలో ఆయన శనివారం వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, ఆ శాఖ ఉన్నతాధికారులతో విత్తనోత్పత్తిపై సమీక్షాసమావేశం నిర్వ హించారు. నాణ్యమైన విత్తనోత్పత్తి చేసేం దుకు పరస్పర సహకారంతో కృషి చేయాలని మంత్రి సూచించారు.

విత్తనోత్పత్తి ప్రాసెసింగ్‌ కోసం ఏర్పాట్లను చేసుకోవాలని విత్తన ధ్రువీకరణ అధికారులకు తెలిపారు. త్వరలోనే 2,638 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియమిస్తున్నామన్నారు. గ్రామ రైతు సంఘాలను ఏర్పాటు చేయబోతున్నా మని, గ్రామ రైతులందరూ దీంట్లో సభ్యులుగా ఉంటారన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరందించాలనే సంకల్పమున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణలో వనరులెన్నో ఉన్నా ఆంధ్రా పాలకులు పక్షపాత ధోరణితో వ్యవహరించారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు