‘పది’ ఫెయిలైన విద్యార్థులకు రేపటి నుంచి శిక్షణ

24 May, 2015 02:33 IST|Sakshi

- డీఈవోలను ఆదేశించిన విద్యాశాఖ
- జూన్ 17వరకు తరగతులు

హైదరాబాద్:
పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈనెల 27 నుంచి వచ్చే 17 వరకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహించాలని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని డీఈవోలకు సూచించారు.

వచ్చే నెల 18వ తేదీ నుంచి జరుగనున్న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. గణితం, సైన్స్, ఇంగ్లిషు, సోషల్ తదితర సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినవారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. కాగా, శిక్షణ తరగతుల్లో పాల్గొనే టీచర్లకు గౌరవ వేతనం ఇచ్చేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షల్లో దాదాపు 1.40 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు