కిలోమీటర్ మేర నిర్మాణాలపై నిషేధం: కేసీఆర్

18 Jun, 2015 19:36 IST|Sakshi
కిలోమీటర్ మేర నిర్మాణాలపై నిషేధం: కేసీఆర్

వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ ఆలయానికి 1012 కిలోమీటర్ మేర నూతన నిర్మాణాలు చేపట్టవద్దని సీఎం కె.చంద్రశేఖరరావు నిషేధం విధించారు. గురువారం సాయంత్రం ఆయన వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శించారు. అక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వేములవాడ ఆలయ ప్రాంగణాన్ని విస్తరించే యోచనలో ఉన్నామన్నారు. వేములవాడను అద్బుత ఆలయంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

వేములవాడ అభివృద్ధికి అథారిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏటా రూ.100 కోట్ల నిధులు సమకూర్చుతామన్నారు. ఆలయ అభివృద్ధికి శృంగేరి, కంచి పీఠాధిపతులను సంప్రదించే యోచనలో టీసర్కారు ఉన్నట్లు వివరించారు. వచ్చే క్యాబినెట్ సమావేశాల్లో ఆలయ కమిటీ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడి ఆలయ ప్రాంగణంలో నాలుగైదు అంతస్తుల భవనాలను నిషేదిస్తామని తెలిపారు. సిరిసిల్ల- వేములవాడ మధ్య నాలుగు లైన్ల రోడ్డు సౌకర్యాన్ని త్వరలోనే కల్పిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు