పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్‌: ఎంపీ వినోద్‌ 

30 Nov, 2018 02:10 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌ ఎవరినైనా, దేనినైనా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఎంపీ వినోద్‌ అన్నారు. ది తెలంగాణ పెన్షనర్స్‌ సెంట్రల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం హోటల్‌ ది ప్లాజాలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షనర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక డైరెక్టరేట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

కేసీఆర్‌ ప్రభుత్వం తాగునీరు, విద్యుత్‌కు పెద్దపీట వేసిందన్నారు. తమ ప్రభుత్వం పెన్షనర్లను అన్నివిధాలా ఆదుకుంటుందని, పదో పీఆర్‌సీ ప్రకారం 70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు అదనంగా 15 శాతం క్యాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ మంజూరుకు సిఫారసు చేయాలని పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు జి.నర్సయ్య కోరారు. దేవాలయాలు, గ్రంథాలయాల సంస్థ, మార్కెట్‌ కమిటీ, డీసీసీబీ, వాటర్‌ వర్క్స్, సింగరేణి కాలరీస్‌లో రిటైర్డ్‌ అయిన వారికి  హెల్త్‌ కార్డులు మంజూరు   చేయాలంటూ వినతిపత్రం ఇచ్చారు. సమావేశంలో సంఘం గౌరవ సలహాదారు దేవీ ప్ర సాద్, ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడె ంట్‌ టి.ప్రేమ్‌కుమార్, కోశాధికారి శ్రావ ణ్‌కుమార్, నవనీతరావు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు