స‘కళ’ం.. ఆమె సొంతం

3 Oct, 2019 10:55 IST|Sakshi
శాంతి కతిరావన్‌

మహిళల కోసం ప్రత్యేక ఎక్స్‌పోలు

పెరుగుతున్న డిమాండ్‌

కళకళలాడే డిజైనర్‌ దుస్తులు, ఆభరణాలు, చేనేత కళలు, మ్యూరల్‌ ఆర్ట్, యాక్సెసరీస్‌ వెరసి మహిళల కోసం కొలువుదీరే ఎక్స్‌పోల డిమాండ్‌ అంతా ఇంతా కాదు.  పదేళ్ల క్రితం సంపన్నులకు మాత్రమే పరిచయమున్న ఎక్స్‌పోలు ట్రెండ్జ్‌ పేరుతో సిటీకి చెందిన శాంతి కతిరావన్‌  మధ్యతరగతికి చేరువ చేశారు. నిర్వహణలో సృజనాత్మక పోకడలకు నాంది పలికి, 130 పైగా ట్రేడ్‌ ఎక్స్‌పోలను నిర్వహించిన ఏకైక తెలుగు మహిళగా నిలిచారు. ఎక్స్‌పోల నిర్వహణ కోసం ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటుతో ట్రెండ్‌కు తెరతీశారు.విభిన్న కళల సమాహారమైన డిజైనర్‌ ఎక్స్‌పోట్రెండ్జ్‌ ప్రదర్శనతాజ్‌కృష్ణా హోటల్‌లోనిర్వహిస్తున్న సందర్భంగా ఆమె పంచుకున్నవిశేషాలు ఆమె మాటల్లోనే... 

సాక్షి, సిటీబ్యూరో :ఎంబీఏ కంప్లీట్‌ చేసి, బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తూ బాబు పుట్టాక బ్రేక్‌ తీసుకున్నాను. ఆ బ్రేక్‌లో సరదాగా 2010 డిసెంబరులో విశాఖలోని ఫారŠూచ్యన్‌ శ్రీకన్య హోటల్‌లో ‘ట్రెండ్జ్‌’ స్టార్ట్‌ చేశా. అది విజయవంతం అయింది. 2011 జనవరిలో సిటీలో తొలి ఎక్స్‌పో శ్రీనగర్‌కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో చేశాను. ఏడాది పాటు హాబీగా చేసినా తర్వాత దీన్ని పూర్తిస్థాయిలో టేకప్‌ చేశా. అప్పట్లో స్టార్‌ హోటల్స్‌కి మహిళలు ఒంటరిగా రావడానికి ఇబ్బంది పడే విశాఖ, విజయవాడల్లో ఎక్స్‌పో పరిచయం చేసింది నేనే.

సర్వం ‘మహిళ’మయం...
కలలు కనడంలోనే కాదు కళలను పసిగట్టడంలోనూ మహిళలే ముందుంటారు. ఉదాహరణకు కంచి పట్టు చాలా ఫేమస్‌...కానీ చీరాల పట్టు కూడా అంతే నాణ్యంగా ఉంటుంది. కుప్పడం వర్క్‌ మరింత అందుబాటు ధరలో ఉంటుంది. దాన్ని మహిళలు చక్కగా గమనించగలరు అందుకే సిటీలో ఈ వర్క్‌కు ఆదరణ ఎక్కువ. గతంతో పోలిస్తే ఇప్పుడు చేనేత, హస్తకళాకారుల వర్క్‌కు డిమాండ్‌ బాగా ఉంది అయితే కళ చేతిలో ఉన్నా వీవర్స్‌కి వ్యాపార మెళకువలు తెలియడం లేదు. కంచి, చీరాల కుప్పడం, గద్వాలకు చెందిన హస్తకళాకారుల వర్క్స్‌కి బాగా డిమాండ్‌ ఉంది. మనం ఎంత గొప్ప వర్క్‌ సృష్టించామనేది ఎంత ముఖ్యమో దాన్నెంత బాగా వినియోగదారుని దగ్గరకు చేర్చగలమనేది కూడా అంతే ముఖ్యం. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే డిజైనర్లు, ఆర్టిజన్స్‌ విక్రయశైలి వల్ల వారికి స్పందన బాగా లభిస్తుంది.

ఎక్స్‌పో వర్సెస్‌ షోరూమ్‌
ఎగ్జిబిషన్‌లో ప్రతి కస్టమర్‌కి రెడ్‌ కార్పెట్‌ పరుస్తాం. షోరూమ్స్‌లో ఎవరో ఒక కస్టమర్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ని సంప్రదిస్తాం. ఇక్కడ తయారీదారులు/కస్టమర్లు ప్రత్యక్షంగా కలుస్తారు. అంతేకాదు మార్కెట్‌ కన్నా ముందు ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు షోరూమ్‌ల తరహాలోనే ఎక్స్‌పోలలో కూడా రూ.1500 నుంచీ ఉత్పత్తులు లభిస్తున్నాయి.

దక్షిణాది వ్యాప్తంగా...
తొలుత ఏడాదికి మూడు సార్లు చేసేవాళ్లం. సిటీలో ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటు చేసి ఇప్పుడు మన సిటీలోనే 20దాకా,అలాగే దక్షిణాది మొత్తం చేస్తున్నా.. కోయంబత్తూర్, కొచ్చిలో కూడా ఆఫీస్‌లు స్టార్ట్‌ చేశాం. భవిష్యత్తులో వైవిధ్యభరితమైన ఎక్స్‌పోలు నిర్వహించాలని ఉంది.

>
మరిన్ని వార్తలు