‘సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం’

14 Mar, 2019 18:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లోకసభ ఎన్నికలకు భద్రతా ఏర్పాట్లు చేశామని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని సీపీ సజ్జనర్‌ తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులకు సూచనలు ఇచ్చామని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సెగ్మెంట్‌కి.. కో ఆర్డినేటర్లుగా ఏసీపీ, ఇన్ స్పెక్టర్లను నియమించినట్లు వెల్లడించారు. ఈ ఎన్నికలు ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్‌గా జరగాలని అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హోర్డింగులు, ఫ్లెక్సీలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలన్నారు.

మద్యం, నగదు తరలింపుపై చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, పోలింగ్ స్టేషన్‌కి 200 మీటర్ల లోపు పార్టీ ఆఫీస్‌లు ఉండరాదన్నారు. ఎన్నికల క్యాంపెయినింగ్‌కు ఉపయోగించే వాహనాలకి రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతంలో 200 మీటర్ల వరకు 144 సెక్షన్ విధిస్తున్నామని వెల్లడించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు