నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

2 Sep, 2014 02:54 IST|Sakshi

మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, సంబంధిత ఆధికారులు అందుకు తగినట్లుగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ డి.నాగేంద్రకుమార్ అన్నారు. సోమవారం  జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసుల ఆధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయ న మాట్లాడుతూ పోలీసు సహాయం కోరి వచ్చిన బాధితులకు సకాలంలో సత్వరన్యాయం చేసేందుకు ఆధికారులు, సిబ్బంది కృషి  చేయూలన్నారు.  పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నేర వ్యవస్థ పోలీసులకు సవాల్ విసురుతున్నదని దీనిని ధీటుగా ఎదుర్కొనేందుకు వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని ఆధికారులను ఆదేశించారు.
 
 ఆధికారులు స్వయంగా నేర స్థలాలను సందర్శించడం వల్ల సిబ్బందికి మార్గదర్శకంగా ఉండడంతోపాటు అనుభవజ్ఞలైన ఆధికారుల సలహాలు ఉపకరిస్తాయన్నారు. దొంగతనాలను నియంత్రించేందుకు అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని సేకరించడంలో శ్రద్ధ చూపాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారెంట్లు, సమన్లను  ఎప్పటికప్పుడు సంబందింత వ్యక్తులకు ఆందజేసి కేసుల దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు.  సమావేశంలో ఆడిషనల్ ఎస్పీ వి.ప్రకాశ్‌రావ్, డీఎస్పీలు కృష్ణమూర్తి, గోవిందరెడ్డి, రామేశ్వర్, గోవర్ధన్, మహేష్, సిఐలు పాల్గొన్నారు.
 
 పదవి విరమణతో ప్రశాంతత
 ఎంతో కాలంగా పోలీసులుగా సేవలందించిన తన సిబ్బందికి సత్కారం చేయడం తనకు ఆనందంగా ఉందని ఎస్పీ పేర్కొన్నారు.పదవీ విరమణ అనంతరం సిబ్బంది కుటుంబంతో ప్రశాంత జీవితం గడపాలన్నారు. పదవీ విరమణ పొందిన వారిలో ఎస్‌ఐలు క్రిష్ణయ్య, ఖాజా రషీదోద్దిన్, ఎండి. ఇస్మాయిల్, హెచ్‌సిలు, సత్యవిజయరాజ్,కార్యలయ సిబ్బంది రామస్వామి, శివకుమార్‌లను సన్మానించారు.  కార్యక్రమంలో జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, పిఆర్‌ఓ రంగినేని మన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు