శబరిమల స్పెషల్‌ యాత్రలు

6 Nov, 2019 07:51 IST|Sakshi

సనత్‌నగర్‌: అయ్యప్ప దీక్షలు షురూ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల కోసం శబరిమల ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు ట్రావెల్‌ ఏజెన్సీలు. కొందరు గురుస్వాములు కూడా భక్తులను యాత్రలకు తీసుకెళ్తున్నారు. పల్లె మదనగోపాల్‌రెడ్డి గురుస్వామి (17వ పడి) ఆధ్వర్యంలో శబరిమల స్పెషల్‌ యాత్రలు జరగనున్నాయి. ఐదు రోజుల యాత్రలో భాగంగా 19 ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనకు అవకాశం కల్పిస్తున్నారు. ఫుష్‌బ్యాక్‌ వీడియో కోచ్‌ (2 ప్లస్‌ 2) వాహనంలో ఈ నెల 28, డిసెంబర్‌ 6, 14, 28, జనవరి 9 తేదీల్లో ఈ యాత్రలు ప్రారంభమవుతాయి. బీచుపల్లి, అలంపూర్, కాణిపాకం, అరకొండ, శ్రీపురం, అరుణాచలం, చిదంబరం, శ్రీరంగం, ఫలణి, పంబ, శబరిమల ప్రాంతాల సందర్శన ఉంటుంది. ఐదు రోజుల యాత్రకు రూ.7200 చార్జిగా నిర్ణయించారు. వివరాలకు 98663 34040 నెంబర్‌లో సంప్రదించవచ్చు.

ఆరు రోజుల యాత్ర ...
భాస్కర్‌గురుస్వామి (23వ పడి) ఆధ్వర్యంలో శబరిమలై ప్రత్యేక యాత్రలు నిర్వహిస్తున్నారు. ఫుష్‌బ్యాక్‌ కలర్‌ వీడియో కోచ్‌ వాహన సౌకర్యం ఉంటుంది. నవంబర్‌ 24,  డిసెంబర్‌ 1, 11, 20, 29, జనవరి 5, 9 తేదీల్లో ఈ యాత్రలు ఉంటాయి. ఈ యాత్రలో మహానంది, కాణిపాకం, భవానీ లేక ఫలణి, గురువాయూర్, ఏరిమేలి, పంపా, శబరిమల, కన్యాకుమారి, తిరుచందూర్, రామేశ్వరం, మధురై, తిరుపరన్‌ కుండ్రం, అరుణాచలం లేక కంచి, గోల్డెన్‌ టెంపుల్‌ ప్రదేశాలను సందర్శించవచ్చు. ఆరు రోజుల ప్యాకేజీకి గాను సిట్టింగ్‌ రూ.7,500, స్లీపర్‌ రూ.9,000 చార్జి చేస్తున్నారు. వివరాలకు 88850 99225 నెంబర్‌లో సంప్రదించవచ్చు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా