కాచిగూడ–కాకినాడ ప్రత్యేక రైలు

23 Dec, 2017 02:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాచిగూడ–కాకినాడ మధ్య ప్రత్యేక రైలు నడుపనున్నట్లు  దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ–కాకినాడ (07452/07453) ప్రత్యేక రైలు ఈ నెల 23న (శనివారం) సాయంత్రం 7.50 కి కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు (ఆదివారం) ఉదయం 6 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 25వ తేదీ (సోమవారం) రాత్రి 8 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 7 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని తెలిపారు.

మరిన్ని వార్తలు