రైలు సమాచారం!

28 Aug, 2018 01:52 IST|Sakshi

సికింద్రాబాద్‌ – కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్‌– కాకినాడ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్‌– కాకినాడ టౌన్‌ స్పెషల్‌– సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌ నుంచి ఆగస్టు 31న రాత్రి 9.35 గంటలకు బయలుదేరి మరునాడు ఉదయం 9.25 గంటలకు కాకినాడ చేరుతుంది. తిరిగి సెప్టెంబర్‌ 2న రాత్రి 8.30 నిమిషాలకు కాకినాడ టౌన్‌ నుంచి బయల్దేరి మరునాడు ఉదయం 8.35 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.

యశ్వంత్‌పూర్‌–ధన్‌బాద్‌ల మధ్య ప్రత్యేక రైలు..
యశ్వంత్‌çపూర్‌ –ధన్‌బాద్‌ జంక్షన్‌ల మధ్య జన్సాదరణ్‌ ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌ ట్రెయిన్‌ పేరుతో ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ఆగస్టు 27, సోమవారం రాత్రి గం.11.40కు యశ్వంత్‌పుర్‌ నుంచి బయల్దేరి గురువారం తెల్లవారుజామున 3.00గంటలకు ధన్‌బాద్‌ చేరుతుంది. ఈ రైలుకు ఏపీలోని గూడురు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, బొబ్బిలిలో హాల్టింగ్‌ సదు పాయం కల్పించారు.

 వేళల్లో మార్పులు..
1. యశ్వంత్‌పుర్‌ నుంచి ఆగస్టు 27 తేదీ సాయం త్రం 5.20 గంటలకు బయల్దేరాల్సిన యశ్వంత్‌పూర్‌ – గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 11 గంటలకు బయల్దేరుతుంది.  
2. బెంగళూరు కాంట్‌ నుంచి ఆగస్టు 28న ఉ.10.15 గంటలకు బయల్దేరాల్సిన బెంగళూరు కాంట్‌ – అగర్తలా హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 11.55 నిమిషాలకు బయల్దేరుతుంది. పెయిర్‌ ట్రెయిన్లు ఆలస్యంగా నడుస్తున్నందున ఈ మార్పులు జరిగాయని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆ స్టాప్‌ ప్రయాణికులకోసం కాదు..
కాచిగూడ – టాటానగర్‌–కాచిగూడ స్పెషల్‌ ట్రెయిన్‌ (నం.07438/07439) ఆగస్టు 24న సింహాచలం నార్త్‌ స్టేషన్‌లో ఆగుతుంది. అయితే, రైలు నిర్వహణ పరమైన కారణాలతోనే ఈ స్టాప్‌ ఇచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివరించారు. ప్రయాణికులు ఈ స్టేషన్‌లో ఎక్కేందుకు లేదా దిగేందుకు అధికారిక అనుమతి లేదని స్పష్టం చేశారు.   

మరిన్ని వార్తలు