ఇందూరు మీదుగా ప్రత్యేక రైళ్లు

22 Nov, 2018 17:21 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ అర్బన్‌: అయ్యప్ప భక్తుల కోసం రైల్వేశాఖ రెండు ప్రత్యేక రైలు నడుపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రైలు నంబరు 07613 నిజామాబాద్‌– కొల్లాం రైలు డిసెంబర్‌ 6న నిజామాబాద్‌ నుంచి మధ్యహ్నం 12.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.55 చేరుకుంటుంది. ఈ రైలు కామారెడ్డి, మేడ్చల్, బొల్లారం, మల్కాజిగిరి, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్‌ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, కొండాపురం, ముద్దనూర్, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, కోడూర్, రేణిగుంట, తిరుత్తని, కట్పాడి, వినయంబడి, జోలర్‌పెట్టాయి, సేలం, ఈరోడ్, తిరుపూర్, కోయంబత్తూర్, పాలక్కడ్, ఒట్టపాలేం, త్రిసూర్, అలువా, ఎర్నకులం టౌన్, కొట్టాయం, తిరువల్ల, చెంగునూర్, మవేలికర, కల్యకులం మీదుగా కొల్లాంకు చేరుకుంటుంది. ఈ రైలులో సెకండ్, థర్డ్‌క్లాస్‌ ఏసీ బోగిలు, ఏసీ చైర్‌కారు, స్లిపర్‌ క్లాస్, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ బోగిలు ఉంటాయని అధికారులు తెలిపారు.

 ఔరంగాబాద్‌– కొల్లాం మధ్య..

 వచ్చేనెల 7న ఔరంగాబాద్‌– కొల్లాం రైలు నం.07505 నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు డిసెంబర్‌ 7న ఔరంగాబాద్‌లో ఉదయం 11 గంటలకు బయలుదేరి కొల్లాంకు డిసెంబర్‌ 9న ఉదయం 4.45 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు జాల్నా, సేలు, పర్బణి, పూర్ణ, నాందేడ్, ముత్కేడ్, ధర్మబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, బొల్లారం, మల్కాజిగిరి, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్‌ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, కొండాపురం, ముద్దనూర్, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, కోడూర్, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, వినయంబడి, జోలర్‌పెట్టాయి, సేలం, ఈరోడ్, తిరుపూర్, కోయంబత్తూర్, పాలక్కడ్, ఒట్టపాలేం, త్రిసూర్, అలువా, ఎర్నకులం టౌన్, కొట్టాయం, చెంగచెర్రి, తిరువల్ల, చెంగునూర్, మవేలికర, కల్యకులం మీదుగా కొల్లాంకు చేరుకుంటుంది.

తిరుపతి– ఔరంగాబాద్‌ మధ్య...

తిరుపతి– ఔరంగాబాద్‌ మధ్య డిసెంబర్‌ 11న ప్రత్యేక రైలు నడుపనున్నారు. రైలు నం.07410 తిరుపతిలో డిసెంబర్‌ 11న ఉదయం 11 గంటలకు బయలుదేరి కాచిగూడకు రాత్రి 11.25 గంటలకు, ఔరంగాబాద్‌కు డిసెంబర్‌ 12న ఉదయం 10.30 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, కోడూర్, రాజంపేట్, కడప, ఎర్రగుంట్ల, ముద్దనూర్, కొండాపురం, తాడిపత్రి, గుత్తి, డోన్, కర్నూల్‌ సిటీ, గద్వాల్, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, కాచిగూడ, మల్కాజిగిరి, బొల్లారం, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మబాద్, ముత్కేడ్, నాందేడ్, పూర్ణ, పర్బణి, జల్నా మీదుగా ఔరంగాబాద్‌కు చేరుకుంటుంది. అయ్యప్ప భక్తులు, ప్రయాణికులు ఈ రైళ్లను ఉపయోగించుకోవాలని కోరారు.  
 

మరిన్ని వార్తలు