‘మిషన్ భగీరథ’లో స్పీడు పెంచాలి.

17 Dec, 2015 05:24 IST|Sakshi
‘మిషన్ భగీరథ’లో స్పీడు పెంచాలి.

- సంపు పనులను పరిశీలించిన   స్మితా సబర్వాల్, ఎస్‌పీ సింగ్
 
 మేడ్చల్ :
మిషన్ భగీరథ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌పీ సింగ్ అన్నారు. బుధవారం వారు మిషన్ భగీరథకు సంబంధించి మేడ్చల్ మండలంలోని ఘనాపూర్ క్షేత్రగిరిపై నిర్మించిన గోదావరి జలాల సంపును, మేడ్చల్‌లో టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో, గిర్మాపూర్, ఎల్లంపేట్, సోమారం గ్రామాల్లో సంపులను నిర్మించనున్న ప్రాంతాలను పరిశీలించారు.
 
  అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నాణ్యతలో రాజీ పడొద్దని, వచ్చేఏడాది ఏప్రిల్‌లోపు పనులను పూర్తిచేయాలని ఎస్‌పీ సింగ్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, మేడ్చల్ తహశీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీడీఓ దేవసహాయం, నగర పంచాయతీ కమిషనర్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 భోగారంలో సంపు నిర్మాణ పనులను  పరిశీలించిన స్మితా సబర్వాల్
 కీసర : మండలంలోని భోగారంలో మిషన్ భగీరథ పనులలో భాగంగా చేపడుతున్న సంపు నిర్మాణ పనులను సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. అధికారులతో కలిసి కీసరగుట్టలో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో పాల్గొని వెళ్లిపోయారు.
 

మరిన్ని వార్తలు