తెలంగాణ పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలి

15 Oct, 2014 03:32 IST|Sakshi

వరంగల్ సిటీ : తెలంగాణ ప్రాంతంలో పండే పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు తెలంగాణ కాటన్, మిల్లర్స్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముంబాయిలో జరిగిన మినీ టెక్స్‌టైల్ కాటన్ అడ్వయిజరీ బోర్డు సమావేశానికి తాను హాజరయ్యానని, సీసీఐ మేనేజింగ్ డెరైక్టర్ బొంబాయి, కోయంబత్తూర్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత జరిగిన సమావేశ ం కాబట్టి బోర్డు సమావేశంలో కూడా తెలంగాణను చేర్చాలని, ఇక్కడ పండిన పత్తి నాణ్యమైనందున తగిన డిమాండ్ ఉండాలని బోర్డు సభ్యులను కోరినట్లు తెలిపారు. పత్తి నాణ్యతను తెలుపుతూ అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు