ఈ కారుకు పవనమే ఇంధనం

8 May, 2014 18:56 IST|Sakshi
ఈ కారుకు పవనమే ఇంధనం

తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఫైనలియర్ విద్యార్థులు పవనశక్తి(గాలి)తో నడిచే కారును తయారు చేశారు. కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులు సాయికిరణ్, అనిల్‌రెడ్డి, ప్రశాంత్, నరేశ్ బుధవారం కళాశాలలో ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా రూ.60 వేల ఖర్చుతో 45 రోజులపాటు శ్రమించి ఇంధనంతో పనిలేని, కాలుష్యం వెదజల్లని కారును వీరు రూపొందించారు.

తాము తయారు చేసిన కారుకు ఉన్న ఫ్యాన్ తిరిగినప్పుడు.. ఆ గాలి యాంత్రికశక్తిగా మారి..విండ్ టర్బైన్ జనరేటర్ సిస్టం ద్వారా విద్యుచ్ఛక్తి తయారై ఎలక్ట్రిక్ (బ్యాటరీలు) మోటార్ల ద్వారా కారు నడుస్తుందని విద్యార్థులు వివరించారు. అయితే కారు ముందుగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో నడిస్తేనే ఫ్యాన్ తిరిగి విద్యుచ్చక్తి తయారవుతుందన్నారు. వాహనం ఎంత స్పీడ్‌గా వెళ్తే అంతగా బ్యాటరీ చార్జి అవుతుందని..ఎలాంటి కాలుష్యం వెదజల్లదని విద్యార్థులు తెలిపారు.

మరిన్ని వార్తలు