నాసా లోకస్‌ ప్రాజెక్టుకు శ్రీచైతన్య విద్యార్థులు

28 Mar, 2018 10:17 IST|Sakshi
విద్యార్థులతో పాఠశాల బృందం 

అల్గునూర్‌(మానకొండూర్‌): నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడిస్ట్రేషన్‌(నాసా) అమెరికాలోని కాలిఫోర్నియా లోకస్‌ ప్రాజెక్టుకు తిమ్మాపూర్‌ మండలంలోని శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని చైర్మన్‌ శ్రీధర్‌రావు తెలిపారు. ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల వల్లే ఇది సాధ్యమైందని, పాఠశాలకు పేరు తెచ్చిన విద్యార్థులను మంగళవారం జరిగిన కార్యక్రమంలో అభినందించారు.
 

నాసా శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ప్రజంటేషన్‌ ఇచ్చే అరుదైన అవకాశం రావడం గొప్ప విషయమన్నారు. ప్రీతిరెడ్డి, నిత్యారెడ్డి, స్నేహా, సంజన, హర్షిత, సాయిభార్గవి, ఐశ్వర్య, శివానీ, గోపిక, అశ్రిత్‌సాయిని అభినందించారు. పాఠశాల డైరెక్టర్‌ శ్రీవిద్య, డీజీఎం విజయలక్ష్మి, ఆర్‌ఐ మహిపాల్‌రెడ్డి, అకాడమిక్‌ కో–ఆర్డినేటర్‌ మహేశ్, ఏవో అమరేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ విమలారెడ్డి, డీన్‌ కరుణాకర్‌రెడ్డి, నాసా ఇన్‌చార్జి ఇందిర, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు