నిన్న డీమార్ట్‌.... ఇవాళ రత్నదీప్‌

16 Apr, 2020 16:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలంటూ అధికారుల సూచనలు, హెచ్చరికలను పలు సూపర్‌మార్కెట్లు పట్టించుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన భౌతిక దూరం నిబంధనలను యాజమాన్యం పాటించకపోవడంతో ఎల్‌బీ నగర్‌ డీమార్ట్‌కు జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఝలక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో  డీమార్ట్‌ను సీజ్‌ చేశారు. తాజాగా శ్రీనగర్‌ కాలనీలోని రత్నదీప్‌ సూపర్‌మార్కెట్‌ను గురువారం అధికారులు  సీజ్‌ చేశారు. (కరోనా కట్టడికి ఇదే మార్గం! భౌతిక దూరం అంటే ఇదీ!)

సూపర్‌ మార్కెట్‌లో సామాజిక దూరంతో పాటు, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడంతో అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. కాగా నిబంధనల ప్రకారం భౌతిక దూరంతో పాటు ...సూపర్‌ మార్కెట్‌కు వచ్చేవారికి శానిటైజర్లు కూడా యాజమాన్యం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే అధికారుల తనిఖీల్లో రత్నదీప్‌ సూపర్‌ మార్కెట్‌ అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సీజ్‌చేసి నోటీసులు అంటించారు. (కోవిడ్-19: ఇలా చేస్తే కరోనా రాదు!)

మరిన్ని వార్తలు