ఇంటికి చేరిన శ్రీనివాస్ మృతదేహం

14 Feb, 2015 13:58 IST|Sakshi

ఆదిలాబాద్ : సౌదీఅరేబియాలో గతనెల 21న గుండెపోటుతో మృతి చెందిన బెడ్యారపు శ్రీనివాస్ మృతదేహం శనివారం స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌కు చేరింది. రెండు సంవత్సరాల క్రితం కూలీ పనుల కోసం శ్రీనివాస్ సౌదీ అరేబియా వెళ్లాడు.

కాగా అక్కడ అతని యజమాని సరిగా జీతం చెల్లించకపోవడం, ఇంటి దగ్గర అప్పులు పెరిగిపోయాయి.దీంతో  శ్రీనివాస్ తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ క్రమంలోనే అతను గుండెపోటుతో జనవరి 21న మరణించాడు. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
(ఖానాపూర్)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా