బీసీలను అణగదొక్కుతున్నారు

12 Sep, 2018 02:38 IST|Sakshi

జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌: జనాభాలో 56 శాతం ఉన్న బీసీలను అణగదొక్కు తూ రాజకీయ పార్టీలు లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. బీసీల రాజకీయ చైతన్య బస్సు యాత్ర ముగింపు సందర్భంగా ఉప్పల్‌లో మంగళవారం నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను వర్షం పడటంతో వాయిదా వేశారు. అనంతరం చిలుకానగర్‌లో జస్టిస్‌ ఈశ్వరయ్య, తూళ్ల వీరేందర్‌గౌడ్‌లతో కలసి జాజుల విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా 80 నియోజకవర్గాలు, 31 జిల్లాల్లో నిర్వహించిన బస్సుయాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజ నం పలికారని తెలిపారు. బీసీలకు చట్టసభల్లో సీట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. త్వరలో రాజకీయ ప్రణాళికలు సిద్ధం చేసి జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే విధంగా కొట్లాడతామన్నారు. రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉం డాలన్నా, పీఠం ఎక్కాలన్నా బీసీలే శాసించే స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేత సచిన్‌ రాజిల్కర్, తమిళనాడు బీసీ సంక్షేమ సంఘం నేత కార్గెల్, బీసీ సంఘం నేత నెర్ధం భాస్కర్‌గౌడ్, సంఘం ప్రధాన కార్యదర్శి దుర్గయ్యగౌడ్, బీసీ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు భైరి శేఖర్, సుర్వి జంగయ్యగౌడ్‌  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు