‘రైతు పట్టించుకోకుంటే ఆకలి చావులు చస్తాం’

17 Jun, 2020 17:04 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : కరోనా విషయంలో ఎంతమందికైనా చికిత్స చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.  కరోనా ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని, వ్యాక్సిన్ వచ్చేదాకా జాగ్రత్తగా ఉండాల్సిందేన్నారు. అజాగ్రత్త వల్ల ప్రాణహాని కలిగే అవకాశం ఉందని, ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలని కోరారు. కరోనాపై ప్రజల్లో చైతన్యం రావాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారన్నారు. ఈ సందర్భంగా బుధవారం మంత్రి మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లాలో భూత్పూర్ కేంద్రంగా నకిలీ విత్తనాల దందా జరిగేదన్నారు. దీనిపై 8 కేసులు నమోదు చేశామని మంత్రి తెలిపారు. 15వేల నకిలీ విత్తనాల పాకెట్లను సీజ్ చేశామన్నారు. (ఎన్‌ఆర్‌సీపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం )

నవాబుపేటలో కూడా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయని మంత్రి పేర్కొన్నారు. వీరిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. రైతు లేనిదే రాజ్యం లేదని,  రైతు పట్టించుకోకుంటే ఆకలిచావులు చస్తామని అన్నారు. వరి రైతులకు సంబంధించిన విత్తనాలు ప్రభుత్వం వద్ద సమృద్ధిగా ఉన్నాయన్నారు. ఏ రైతు కూడా వరి ధాన్యం విత్తనాన్ని బయటకొనవద్దని సూచించారు.  జిల్లాలో ఎలాంటి అక్రమాలు ఎవరి దృష్టికి వచ్చిన జిల్లా కలెక్టర్ కు, ఎస్పీకి సమాచారం అందించాలని కోరారు. మోసాలకు, బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయన్నారు.  (సుశాంత్‌ ఆత్మహత్య; కరణ్‌కు మద్దతుగా వర్మ)

అదే విధంగా అతి త్వరలోనే రైతుబంధు డబ్బులు రైతులకు జమ చేస్తున్నామని మంత్రి అన్నారు. హరితహారంలో భాగంగా జిల్లాలో కోటి మొక్కలను నాటేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈ ఏడాది అటుఇటుగా పూర్తిచేసి, అన్ని ప్రాంతాలకు సాగునీరు అందిస్తామన్నారు. జిల్లా రూపురేఖలు మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తామని,అధికారులు ఏ చర్య తీసుకున్నా ప్రజా అభివృద్ధి కోసమే అని తెలుసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌ సూచించారు. (డిప్రెష‌న్‌కు లోనైనందుకు సిగ్గుప‌డ‌ను.. )

మరిన్ని వార్తలు