బాడ్మింటన్‌కు పుట్టినిల్లు తెలంగాణ

16 Nov, 2019 03:17 IST|Sakshi
కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజుకు జ్ఞాపికను అందజేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బాడ్మింటన్‌కు తెలంగాణ పుట్టినిల్లుగా ఆవిర్భవించిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. వివిధ క్రీడల్లో ప్రపంచ స్థాయి క్రీడాకారులను అందిస్తున్న తెలంగాణ దేశానికే గర్వకారణంగా నిలుస్తోందన్నారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజుజు అధ్యక్షతన జరిగిన అన్ని రాష్ట్రాల క్రీడా, యువజన వ్యవహారాల శాఖ మంత్రుల సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. ఆయన  మాట్లాడుతూ.. తెలంగాణలో క్రీడలకు సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. తెలంగాణ నుంచి క్రీడా రంగం కోసం రూ. 218 కోట్ల ప్రతిపాదనలు పంపితే అందులో రూ.19 కోట్లే విడుదల చేశా రని గుర్తు చేశామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను అందిస్తున్న రాష్ట్రాలకు కేంద్రం నిధులు కేటాయించాలని కోరామన్నారు.

మరిన్ని వార్తలు