‘బతిమాలడం మాని చర్య తీసుకోండి’

10 Apr, 2020 09:32 IST|Sakshi

నిబంధనలు పాటించకుంటే ఆరు నెలల పాటు దుకాణాలు సీజ్

వ్యాపారులకు రాష్ట్ర ఎక్సైజ్‌శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరిక  

సాక్షి, జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): నిత్యావసరాలను అధిక రేట్లకు అమ్మే వ్యాపారులను బతిమాలడం మానుకొని కేసులు నమోదు చేయాలని జిల్లా అధికారులను రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. గురువారం స్థానిక రెవెన్యూ హాల్‌లో వ్యాపారస్తులతో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ వెంకట్రావ్‌తో కలిసి మంత్రి మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని అలీస్‌మార్ట్స్, హాష్మీ లాంటి మాళ్ల వద్ద భౌతికదూరం పాటించడం లేదని వాపోయారు. నిర్వాహకులు శానిటైజర్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. నిబంధనలు పాటించకుంటే 6 నెలలు దుకాణాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. కోటా ఇండస్ట్రీస్‌లో పనిచేసేందుకు కార్మికులు రావడం లేదని యజమాని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వేతనాలు పెంచి కిరవచ్చేలా చూడాలన్నారు. లాభాపేక్షతో కాకుండా మానవతా దృక్పథంతో పని చేయాలన్నారు. కరోనా అనుమానితులకు ముద్ర వేసి క్వారంటైన్‌లో ఉంచాలన్నారు. వ్యాపారులకు ఎలాంటి సమస్య ఉన్నా తక్షణం పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సీతారామారావు, డీఎస్‌ఓ వనజాత, వ్యాపారులు పాల్గొన్నారు. (లాక్‌డౌన్‌: దండంపెట్టి చెబుతున్నా..!)

కరోనాను తరిమికొడదాం 
మహబూబ్‌నగర్‌ రూరల్‌: కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు ప్రజలు ఇంటిపట్టునే ఉండాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని 2, 3, 4, 5 వార్డుల్లోని నిరుపేదలకు అరుంధతి బంధు సేవాసమితి ఆధ్వర్యంలో గురువారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  అవగాహన కలి్పంచారు. ఈ సందర్భంగా అరుంధతి బంధు సేవాసమితి సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సిములు, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కోరమోని వెంకటయ్య, అరుంధతి సేవాసమితి అధ్యక్షుడు రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి హన్మంతు, టీఎమ్మారీ్పఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లెపోగు శ్రీనివాస్‌ పాల్గొన్నారు. (కోలుకున్న కరోనా బాధితులు)


ఏనుగొండలో నిత్యావసరాలు అందజేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

నిరుపేదల అవసరాలు తీర్చాలి 
లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరుపేద అవసరాలను తీర్చాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో రెడ్‌క్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో జూస్‌ బాటిల్స్‌ను  అందజేశారు. ప్రజల అవసరాల నిమిత్తం వీటిని ఉపయోగించాలని సూచించారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకులతో పాటు పేదలకు పంపిణీ  చేయాలన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ నటరాజు, జనార్దన్‌ పాల్గొన్నారు. (లాక్‌డౌన్‌: 40 కి.మీ. నడిచి.. ప్రియుడిని కలుసుకుని..) 

మరిన్ని వార్తలు