ధర్మభిక్షానికి భారతరత్న ఇవ్వాలి

9 Nov, 2019 05:29 IST|Sakshi
విగ్రహావిష్కరణ అనంతరం మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వినతి

సంస్థాన్‌నారాయణపురం: స్వాతంత్య్ర సమర యోధుడు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షానికి కేంద్రం భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్మభిక్షం విగ్రహాన్ని శుక్రవారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన జీవిత చరిత్రను పాఠ్యంశాలుగా చేర్చడానికి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రధాన పట్టణాలలో ధర్మభిక్షం విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో గీత కార్మికుల సంక్షేమానికి నీరా పాలసీ తీసుకొచ్చామన్నారు. కార్మికులు ప్రమాదం జరిగి మృతి చెందితే రూ.5 లక్షల పరిహారం, గాయాలైతే రూ.10 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. కుల వృత్తుల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి విప్‌ కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్, గీత పనివారల సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు