అమాయకుడిని బలి చేశారు

20 Apr, 2018 01:16 IST|Sakshi

మందుల పార్సిల్‌ అని నమ్మించి డ్రగ్స్‌ పంపించిన గల్ఫ్‌ ఏజెంట్‌

అరెస్టుచేసిన దుబాయ్‌ పోలీసులు

క్షమాభిక్ష పెట్టి విడుదల చేయించాలని కలెక్టర్‌కు బాధిత కుటుంబం వేడుకోలు

ఇందూరు: డ్రగ్స్‌ మాఫియా వలలో చిక్కిన ఓ అమాయకు డు దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. నిజామాబా ద్‌ జిల్లా ఏర్గట్ల మండలం తడ్‌పాకల వాసి పూసల శ్రీనివాస్‌ 2016లో దుబాయ్‌ వెళ్లాడు. విమాన టికెట్‌ బుక్‌ చేసుకోవడానికి మోర్తాడ్‌ మండల కేంద్రంలో  గల్ఫ్‌ ఏజెంటుగా వ్యవహరిస్తున్న మహేశ్‌ వద్దకు వెళ్లాడు.

ఆ సమయంలో మహేశ్‌ ఓ మందుల పార్శిల్‌ శ్రీనివాస్‌కు ఇచ్చి.. దుబాయ్‌లో తమ మనిషి వచ్చి మందులు తీసుకెళ్తాడని చెప్పాడు. అక్కడి పోలీసుల తనిఖీల్లో పార్సిల్‌ డ్రగ్స్‌గా తేలింది. దీంతో శ్రీని వాస్‌ను అరెస్టు చేసిన పోలీసులు, రూ.10 లక్షల జరిమానాతో పాటు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. దీనిపై శ్రీనివాస్‌ కుటుంబీకులు సీఐడీకి ఫిర్యాదు చేశారు.

విచారణలో వీఆర్‌ ఏగా పనిచేసే అశోక్‌ ఆ పార్సిల్‌ ఇచ్చాడని మహేశ్‌ చెప్పా డు. దీంతో శ్రీనివాస్‌ తప్పిదం లేదని, క్షమాభిక్ష కింద అత డిని విడిచిపెట్టాలని భారత ప్రభుత్వం నుంచి దుబాయ్‌ ఇండియన్‌ ఎంబసీకి సీఐడీ అధికారులు లేఖ రాశారు. నివేదిక దుబాయ్‌ ప్రభుత్వానికి చేరే సరికి ఆలస్యమవడంతో ఫలితం లేకపోయింది. శ్రీనివాస్‌ను క్షమాభిక్ష కింద విడిపించాలని తల్లిదండ్రులు రాములు, పోసాని, భార్య లతిక గురువారం కలెక్టర్‌ రామ్మోహన్‌రావును వేడుకున్నారు.

మరిన్ని వార్తలు