రోడ్డున పడ్డాం, రాజీకి రావా..?

10 Jan, 2018 17:36 IST|Sakshi

భార్య సంగీతను కోరిన శ్రీనివాస్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: తనపై పెట్టిన కేసులు వెనక్కు తీసుకుంటేనే తన మొదటి భార్య సంగీతను కాపురానికి రానిస్తానని బహిష్కృత టీఆర్‌ఎస్‌ నేత శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... 53 రోజులుగా తాను, తన తల్లిదండ్రులు రోడ్డుపై ఉంటున్నామని తెలిపారు. తమ ఇంటిని సంగీత అధీనంలోని తీసుకుందని, ఆమెను కొంతమంది తప్పుదోవ పట్టించారని వాపోయారు.

తనతో రాజీకి సంగీత రూ. 3 కోట్లు డిమాండ్ చేసిందని ఆరోపించారు. మూడేళ్లుగా రాజీకి ప్రయత్నిస్తున్నా, ఆమె ఒప్పుకోవడం లేదని వెల్లడించారు. తన పేరు మీద ఎటువంటి ఆస్తులు లేవని, తల్లిదండ్రులపైనే ఆధారపడి బతుకుతున్నానని చెప్పారు. కూతురంటే ప్రాణమని, తనకు వచ్చే ఆస్తి ఆమెకే చెందుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా తన కూతురి పేర ఆస్తి రాయాల్సిన అవసరం లేదన్నారు. విభేదాలన్నీ మర్చిపోయి వస్తే సంగీతను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పారు. కేసులు ఉపసంహరించుకుంటేనే ఆమెతో రాజీ పడతానని తేల్చి చెప్పారు.

నిరూపిస్తే దీక్ష విరమిస్తా: సంగీత
రాజీకి తాను రూ. 3 కోట్లు డిమాండ్ చేసినట్టు నిరూపిస్తే ఇప్పుడే దీక్ష విరమిస్తానని సంగీత తెలిపింది. ఎక్కడోవుండి మాట్లాడం కాదని, ఇంటికి వచ్చి రాజీ గురించి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం శ్రీనివాస్‌రెడ్డికి సరదా అని ఆరోపించారు. కాగా, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బోడుప్పల్‌లోని భర్త ఇంటి ముందు సంగీత 53 రోజులుగా ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా