ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు

21 Nov, 2019 14:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే పెను విషాదం తప్పదని మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ హెచ్చరించారు. ఏదైనా విపత్తు సంభవిస్తే సగం ఆంధ్రప్రదేశ్‌ కనిపించకుండా పోతుందని, దిగువన ఉన్న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టూ కూలిపోతుందని పేర్కొన్నారు. శ్రీశైలం డ్యామ్‌ను సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సర్కార్‌ సత్వర చర్యలు తీసుకుంటే ఈ ప్రాజెక్టును పరిరక్షించుకోవచ్చని చెప్పారు. డ్యాం సమీప నిర్మాణాలపై దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మించడంతోపాటు వాటి నిర్వహణ బాధ్యతలనూ సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు