ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి

10 Mar, 2017 16:42 IST|Sakshi
ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి

దురాజ్‌పల్లి : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్‌కుమార్, ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల శంకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శ్రీరాంసాగర్‌ నీటిని విడుదల చేసి జిల్లాలోని పంటలను కాపాడానికి కోరుతూ గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రాజెక్టులో 1,071 అడుగుల మేర నీరు ఉన్నా.. నీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. అనంతరం కలెక్టర్‌ సురేంద్రమోహన్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు గంటా నాగయ్య, సైదులు, కిరణ్, సంజీవరెడ్డి, గుండు వెంకన్న, బొడ్డు శంకర్, ఉమేష్, ఉప్పలయ్య, వెంకన్న, అంజయ్య పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు