టెన్త్‌ ఎగ్జామ్స్‌: నిమిషం నిబంధనలేదు కానీ,..

18 Mar, 2020 11:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రేపటినుంచి జరగబోతున్న పదవ తరగతి పరీక్షలకు ఒక నిమిషం నిబంధన ఏమీ ఉండదని, కానీ.. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకుంటే మంచిదని ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్‌ఎస్‌సీ పరీక్షల కోసం మొత్తం 5 లక్షల 34 వేల మంది విద్యార్థులు హాజరవుతారని వెల్లడించారు.  2530 పరీక్ష కేంద్రాలు పరీక్షలకు సిద్ధం చేశామని చెప్పారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా ఫ్లైయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలల్లో లిక్విడ్  హ్యాండ్ వాష్ లాంటివి సిద్ధం చేశామని చెప్పారు.

చదవండి : రేపటి నుంచే టెన్త్‌ పరీక్షలు

మరిన్ని వార్తలు