14 నుంచి టెన్త్‌ పరీక్షలు

12 Mar, 2017 07:50 IST|Sakshi
14 నుంచి టెన్త్‌ పరీక్షలు

హాజరు కానున్న 5.38 లక్షల మంది విద్యార్థులు
5 నిమిషాల వరకు ఆలస్యంగా వస్తే అనుమతి


సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి వార్షిక పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 14 నుంచి 30 వరకు జరిగే పరీక్షల ఏర్పాట్లపై శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓరియం టల్‌ ఎస్సెస్సీ పరీక్షలు 14న, రెగ్యులర్‌ ఎస్సెస్సీ పరీక్షలు 17న ప్రారంభమవుతాయ న్నారు. ప్రతి పరీక్ష ఉదయం 9:30నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ఉంటుందని, ద్వితీయ భాష, ఓరియంటల్‌ ఎస్సెస్సీ, కాంపొజిట్‌ కోర్సు పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటాయని వెల్లడించారు.

విద్యార్థులు ఆల స్యం కాకుండా ముందుగానే పరీక్షా కేంద్రా నికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. విద్యార్థులను 8:45 నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని.. 5 నిమిషాల ఆలస్యం (9:35) వరకే పరీక్ష హాల్లోకి అనుమతిస్తా మని, అయితే రోజూ ఆలస్యమైతే మాత్రం విచారణ జరుపుతామని హెచ్చరించారు. హాల్‌టికెట్లను ఇప్పటికే స్కూళ్లకు పంపామని, అందనివారు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసు కోవచ్చని తెలిపారు. వాటిపై ప్రిన్సిపాల్‌ సంతకం అక్కర్లేదన్నారు.

సెల్‌ఫోన్‌ తెస్తే క్రిమినల్‌ కేసు..
విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, చివరకు డిపార్ట్‌ మెంటల్‌ ఆఫీసర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లు సెల్‌ఫోన్లు తీసుకురావద్దని, తెస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. అత్యవసర మైతే సెక్యూరిటీ కానిస్టేబుల్‌ ఫోన్‌ను వినియోగించాలని, ఎవరికి, ఎందుకు కాల్‌ చేశారో రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. పరీక్ష హాల్లోకి ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించరన్నారు. ప్రథమ భాష పార్ట్‌–బి పేపర్‌ను చివరి అరగంటలో ఇస్తారన్నారు. అంధ, మూగ, చెవిటి విద్యార్థులకు స్రైబ్‌ అవకాశం కల్పిస్తున్నామని, ఇప్పటికే అనుమ తులు ఇచ్చామని, ఇంకా ఎవరైనా ఉంటే సంబంధిత చీఫ్‌ సూపరింటెండెంట్‌ను సంప్ర దించాలని సూచించారు. సందేహాలుంటే డీఈవో కార్యాలయాల్లోని వాటితో పాటు రాష్ట్రస్థాయిలోని కంట్రోల్‌ రూమ్‌ నంబరు (040–23230492)లో కూడా సంప్రదించవ చ్చన్నారు. హాల్‌టికెట్‌ పోగొట్టుకున్న విద్యా ర్థులు డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లకు ముం దుగా తెలియజేస్తే తగిన చర్యలు చేపడతారని చెప్పారు. పరీక్షలు పూర్తయిన 35 నుంచి 40 రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

విద్యార్థులకు సూచనలు..
స్కూల్‌ యూనిఫారంతో పరీక్షలకు రావద్దు.
ఇన్విజిలేటర్‌ ఓఎంఆర్‌ పత్రం ఇచ్చాక, ధ్రువీకరించుకున్నాకే సంతకం చేసి, పరీక్ష రాయడం మొదలు పెట్టాలి.
మెయిన్‌ ఆన్సర్‌ షీట్‌పై ఉన్న సీరియల్‌ నంబరును మాత్రమే అడిషనల్‌ షీట్స్, గ్రాఫ్స్, మ్యాప్‌ లు, బిట్‌ పేపర్లపై వేయాలి.
పరీక్ష సమయం పూర్తయ్యే వరకు విద్యార్థులను బయటకు పంపించరు.
14–3–2017: ఓరియంటల్‌ ఎస్సెస్సీ పేపరు–1తో పరీక్షలు ప్రారంభ మవుతాయి.
17–3–2017: రెగ్యులర్‌ ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభమవుతాయి. (17న ప్రథమ భాష పేపర్‌–1).

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా